ఆ బ్యాగ్ తెచ్చిస్తే మంచి గిఫ్ట్ ఇస్తా
'ఐ యామ్ వేరీ కేర్లేస్స్ ' అంటున్నారు శ్రియ. ఇటీవల రెండు సార్లు తన బ్యాగ్ ను మిస్ చేసుకున్న ఈ తార తన గురించి తను ఇలా అనుకుంటున్నారు. ఇటీవల ఒకసారి ఫ్లైట్ లో బ్యాగ్ ను మిస్ చేసుకున్న శ్రియ ఫైనల్ గా దానిని తిరిగి పొందగలిగారు. ఇప్పుడు కూడా అదే మ్యాజిక్ జరిగితే బాగుండు అని దేవుణ్ణి ప్రర్దిస్తున్నారట ఈ ముద్దుగుమ్మ. కొన్ని రోజుల క్రితం ఎమిరైట్స్ ఫ్లైట్ లో శ్రియ తన బ్యాగ్ ను మిస్ చేసుకున్నారు. అందులో తనకు ఇష్టమైన దుస్తులు,పాదరక్షలు ఉన్నాయట.
ఈ విషయాన్ని త్విట్టేర్ లో పోస్ట్ చేసి అది దొరకాలని తనతో పాటు అభిమానులన్దర్నీ ప్రార్దించమని కోరారు శ్రియ. ఎట్టకేలకు తన ప్రార్ధనలు ఫలించి ఆ బ్యాగ్ మల్లి ఆమె పొందగలిగారు కాగా, గత ఆదివారం తన తాజా తమిళ చిత్రం 'చికుబుకు' ప్రచారంలో భాగంగా అన్నీ ముక్య పట్టణాలు పర్యటిస్తున్న శ్రియ మరోసారి ఐర్పొర్ట్ లో తన బ్యాగ్ ను మిస్ చేసుకున్నారట.